Natyam ad

రోడ్డు ప్రమాదం లో కారు..బైకు ఢీ..

ప్రకాశం ముచ్చట్లు:

బేస్తవారిపేట మండలం ఒందుట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.పందిళపల్లి ప్రభుత్వ పాఠశాలలలో హెడ్మాస్టర్ గా విధులు సిర్వహిస్తున్న పద్మావతి అనే మహిళ బేస్తవారిపేట నుండి స్వంతంగా  కారు డ్రైవింగ్ చేస్తూ పందిళపల్లె  వెళుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న బైకును ఢీకొన్నది. ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనదారుడు కొమరోలు మండలం తంబలపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై నరసింహారావు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.ప్రమాదానికి కారకురాలైన పద్మావతి పై ఎస్సై నరసింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

 

Post Midle

Tags: A car collided with a bike in a road accident.

Post Midle