Natyam ad

లారీని ఢికొన్న కారు…ఇద్దరికి తీవ్ర గాయాలు

మహబూబ్ నగర్ ముచ్చట్లు:


జాతీయ రహదారిపై అతివేగంగా వెళ్తున్న ఓ కారు ముందుగా వెళ్తున్న ఓ లారీని  ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించిన ఘటన పాలమూరు జిల్లాలో చోటుచేసుకుంది.మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో హైదరాబాద్ వైపు నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఓ లారీని అతివేగంగా వెళ్తున్న ఓ కారు బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా గాయపడ్డ వారంతా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం పెంజర్ల గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కాగా జాతీయ రహదారిపై అతివేగం దానికి తోడు నిద్రమత్తె ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు పోలీసులు. మరోవైపు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకోవడంతో సుమారు అరగంటకు పైగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

 

Tags: A car collided with a lorry…both seriously injured

Post Midle
Post Midle