మధిర ముచ్చట్లు:
అదుపు తప్పి ఓ కారు చెట్టుపైకి ఎక్కిన ఘటన మధిర మండలంలో ఆదివారం ఉదయం జరిగింది. స్థానికుల వివరాలు ప్రకారం. మధిర మండలం దెందుకూరు గ్రామ సమీపంలో ఓ కారు అదుపుతప్పి చెట్టుపైకి ఎక్కిందని తెలిపారు. కారులో ఉన్న ఇద్దరిని స్థానికులు చాకచక్యంగా బయటకి తీయడంతో ప్రమాదం తప్పింది. కారులో తన తండ్రికి సేఫ్ బెల్ట్ పెడుతుండగా అదుపు తప్పినట్లు కారు నడుపుతున్న కుమారుడు తెలిపాడు. ఈ ప్రమాదంలో తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి.
Tags; A car that went out of control and climbed a tree… a near miss