ప్రభోదానంద పై ఎట్టకేలకు కేసు నమోదు

A case has been registered against Prabhudananda

A case has been registered against Prabhudananda

Date:20/09/2018
అనంతపురం ముచ్చట్లు:
వినాయక నిమజ్జనం సందర్భంగా  శనివారం చిన్నపొలమడ వద్ద గ్రామస్థులు, ప్రబోధానంద అనుచరుల మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఇదే వివాదంపై గ్రామస్థులకు మద్దతుగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆందోళన చెపట్టి, పోలీసుల తీరుపై మండిపడ్డారు. అయితే, ప్రబోధానందపై ఎలాంటి కేసు నమోదుచేయకపోవడంతో జేసీ తీవ్ర విమర్శలు గుప్పించారు.
తాజాగా, గుత్తి పోలీస్‌స్టేషన్‌లో ప్రబోధానంద స్వామిపై కేసు నమోదైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రబోధానంద ప్రసంగించారంటూ టీడీపీ నేత మధుసూదన్‌ గుప్తా ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. సాక్ష్యాలుగా అందజేసిన సీడీలు, పెన్‌డ్రైవ్‌లను పరిశీలించిన పోలీసులు ప్రబోధానందపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రబోధానంద ఎక్కడుంటారన్న దానిపై మాత్రం పోలీసులకు ఎలాంటి సమాచారం లేనట్టు తెలుస్తోంది. ప్రబోధానందకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆశ్రమాలు ఉన్నప్పటికీ చిన్నపొలమడ ఆశ్రమమే ప్రధాన కేంద్రం.
అయితే, ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారనేది ఎవరికీ తెలియదు. ప్రబోధానంద ఈ ఆశ్రమానికి వచ్చి మూడేళ్లు దాటిందని కొందరు భక్తులు చెబుతున్నారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మాత్రం ఆయన ప్రసంగాలు మాత్రం ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఈ ప్రసంగాలను వినడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం వస్తారు. భక్తులు అడిగే సందేహాలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారానే ఆయన సమాధానం ఇస్తుంటారు. ప్రస్తుత భక్తుల్లో చాలామంది ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవట.
ప్రబోధానందపై కేసు నమోదుకావడంతో ఎలా ముందుకెళ్లాలన్నే అంశపై పోలీసులు సమాలోచనలు చేస్తున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం తాడిపత్రి సమీపంలోని చిన్నపొడమల వద్ద ప్రబోధానంద అనుచరులు, గ్రామస్థులకు మధ్య చేలరేగిన వివాదం చినికిచినికి గాలివానలా మారిన విషయం తెలిసిందే. ఈ సమయంలో గ్రామస్థులు, ప్రబోధానంద భక్తుల మధ్య జరిగిన కొట్లాటలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
దీనిపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గ్రామస్థులకు మద్దతుగా ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకుంది. ఈ వ్యవహారంపై బుధవారం సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..పోలీసులపై జేసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసుల వైఫల్యం కారణంగానే చిన్నపొడమలలో ఘర్షణ చోటుచేసుకుందని జేసీ ఆరోపించారు.
ఆశ్రమంలోని ప్రబోధానంద వర్గీయులు రాళ్లతో దాడి చేస్తుంటే చేతిలో తుపాకులు, లాఠీలు ఉన్న పోలీసులే తమ కంటే ముందు పారిపోయారని జేసీ విమర్శించారు. వాహనాలను తగులబెడుతుంటే పోలీసులు చోద్యం చూశారని, వారు ధైర్యంగా నిలబడి కనీసం గాల్లోకి కాల్పులు జరిపినా ఇంతటి విధ్వంసం జరిగేది కాదన్నారు.
Tags:A case has been registered against Prabhudananda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *