Natyam ad

ఎస్పీ ఫకీరప్పపై కేసు నమోదు

విచారణ అధికారిగా పలమనేరు ఎస్డీపివో


అనంతపురం ముచ్చట్లు:


అనంతపురం ఎస్పీ ఫకీరప్పపై టూటౌన్ పీఎస్లో కేసు నమోదైంది. డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఎస్పీ ఫకీరప్పతో పాటు ఏఎస్పీ హనుమంతప్ప, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషాపై కేసులు నమోదు చేశారు. సెక్షన్ 167, 177, 182, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదైంది. డీఐజీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ నాగేంద్రుడు మాట్లాడుతూ డిస్మిస్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఏ.ఆర్ కానిస్టేబుల్ కె.ప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీసు స్టేషన్లో అనంతపురం జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప,అనంతపురం జిల్లా ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఏ.హనుమంతు, అనంతపురం సి.సి.ఎస్ డీఎస్పీ ఎస్ మహబూబ్ బాషాలపై కేసు నమోదు చేశారు.ఈ కేసు విచారణ అధికారిగా చిత్తూరు జిల్లా పలమనేరు ఎస్డీపివో  సి.ఎం.గంగయ్యను నియమిస్తూ అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు.

 

Post Midle

Tags: A case has been registered against SP Fakirappa

Post Midle

Leave A Reply

Your email address will not be published.