దళితులపై దాడి చేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

 

నగర కాంగ్రెస్ పార్టీ డిమాండ్. వెదురుకుప్పం మండలం , మారేపల్లి గ్రామం , లో దళిత యువకులు క్రికెట్ ఆడుతుంటే.. వారిపై వేణుగోపాలపురం , వాయిలాల చెరువు చేనుకు సంబంధించిన అగ్రవర్ణాల గ్రామస్తులు.. కరెంట్ పోల్ కు దళిత యువతను కట్టేసి దాడి చేయడాన్ని తాము ఖండిస్తున్నామని.. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ , ఎస్టీ , అట్రాసిటీ కేసు నమోదు చేసి అగ్రవర్ణ పెద్దలను శిక్షించాలని.. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యార్లపల్లి గోపి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు కాంగ్రెస్ నాయకులు శాంతి యాదవ్ , రవి , వెంకటేష్ గౌడ్ , భాను ప్రకాష్ , నాగరాజ్ తదితరులతో కలిసి యార్లపల్లి మాట్లాడుతూ… నవీన్ , భాస్కర్ తదితర దళిత యువతపై దాడికి పాల్పడిన అగ్రవర్ణాలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వీరు డిమాండ్ చేశారు.

 

 

Tags:A case of atrocity should be registered against those who attacked Dalits

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *