Natyam ad

జర్నలిస్టుల పై దాడి చేసిన అవినాష్ రెడ్డి అనుచరులపై హత్య యత్నం కేసు పెట్టాలి.

టిడిపి,సీపీఎం,సీపీఐ, జనసేన,కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల డిమాండ్.
ఏపీడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా.
ఆడిషినల్ ఎస్పి కి వినతి.

 

కడప ముచ్చట్లు:

Post Midle

గత రెండు రోజుల క్రితం విశ్వభారతి హాస్పిటల్ లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారన్న సమాచారం తో అక్కడకు వెళ్లిన మీడియా ప్రతినిధుల పై అవినాష్ రెడ్డి అనుచరులు కొట్టి గాయపరిచారు.దానికి నిరసనగా ఏపీడబ్ల్యుజెఎఫ్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది.అందులో భాగంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఏపీడబ్ల్యుజెఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బసప్ప,నగర అధ్యక్షులు శివకుమార్ అధ్యక్షత న ధర్నా నిర్వహించారు.ఈ ధర్నా కు సీపీఐ జిల్లా నాయకులు జగన్నాథం,రామకృష్ణ రెడ్జ్,సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.వి నారాయణ,టిపిడి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు సుధాకర్ బాబు,ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుప్తా,జనసేన రాష్ట్ర నాయకులు చింత సురేష్ బాబు,బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ మల్లికార్జున లు పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా కె.వి నారాయణ మాట్లాడుతూ వార్త కవరేజ్ కోసం వెళ్లిన ఆర్ టివి ఆంధ్రజ్యోతి, హెచ్ ఎం టివి మీడియా ప్రతినిధుల పై దాడులు చేయడం చాలా హేయమైన చర్య అన్నారు.సీపీఎం పార్టీ గా జర్నలిస్ట్ లకు ప్రతి పోరాటంలో సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.సీపీఐ జిల్లా నాయకులు జగన్నాథం మాట్లాడుతూ రక్షణ లేకుండా రాక్షస పాలనలో ఉన్నామా ప్రజల మధ్య ఉన్నామా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

 

 

 

మీడియా పై దాడిని సీపీఐ గా ఖండిస్తున్నామన్నారు.టిడిపి జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి మాట్లాడుతూ ఇంతటి అరచకపాలన ఎక్కడ చూడలేదు మీడియాకు కూడా స్వేచ్ఛ లేకుండా దాడులు తెగిస్తున్నారు.ప్రశాంతంగా ఉండే కర్నూలు ను టెన్షన్ వాతావరణం ను సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.మీడియా వారిని దాడి చేసిన వారిని అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలన్నారు.కాంగ్రేస్ పార్టీ డిసిసి అధ్యక్షులు సుధాకర్ బాబు,ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుప్తాలు మాట్లాడుతూ తీవ్రవాదులు ఉగ్రవాదులు ఉండే చోట ఉన్నామా అనే అనుమానం వ్యక్తమవుతుంది. వైసిపి పాలనలో ప్రజలకు, పార్టీలకు, మీడియాకు కూడా కనీస స్వేచ్ఛ లేకుండా అరాచక పాలన చేస్తున్నారన్నారు.జనసేన రాష్ట్ర నాయకులు చింత సురేష్ మాట్లాడుతూ జర్నలిస్ట్ లపై దాడిని రాష్ట్ర పార్టీ తీవ్రంగా ఖండిస్తూ జర్నలిస్ట్ లకు ఎప్పుడు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.బీఆర్ఎస్ పార్టీ జిల్లా కన్వీనర్ మల్లికార్జున మాట్లాడుతూ జర్నలిస్ట్ లపై దాడి చేసినవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

 

 

 

 

బీఆర్ ఎస్ జర్నలిస్టుల కు అండగా ఉంటుందన్నారు.ఏపీడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి,నగర ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, సీనియర్ జర్నలిస్ట్ పానుగంటి చంద్రయ్య, ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ ఎం.యూ.వినయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల పై దాడి చేసిన వారిపై హత్య యత్నం కేసులు నమోదు చేసి చట్టరీత్య కేసులు నమోదు చేయాలి.జర్నలిస్టుల పై దాడులు జరిగిన దానిపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేపట్టాలి.దాడి చేసి గాయపడిన జర్నలిస్ట్ లకు నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. తక్షణమే చర్యలు తీసుకోకుంటే దశల వారిగా ఉద్యమాలు ఉదృతం చేస్తామని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహానికి వినతిని అందించారు.తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆడిషినల్ ఎస్పి ప్రసాద్ కు వినతిని అందించారు. ఆడిషినల్ ఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ డిఎస్పీ స్థాయి అధికారి ఎసై లను మహిళ పోలిస్ లను ఏర్పాటు చేసి విచారణకు అదేశించేలా ఎస్పి కి విన్నవించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి నజీర్ బాషా,ఉపాధ్యక్షులు విద్య సాగర్,సహాయ కార్యదర్శి సునీల్ కుమార్,నాయకులు వెంకటేష్,నాగేంద్రుడు,మోహన్ ,గోపి,మెట్రో టివి స్టాఫర్ మధు,నాగేష్,కిషోర్ కుమార్ రెడ్డి,ఎఐవైఎఫ్ ,జనసేన ,బీఆర్ ఎస్ పార్టీ నాయకులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Tags:A case of attempted murder should be filed against Avinash Reddy’s followers who attacked journalists.

Post Midle