చౌడేపల్లెలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం కేసు నమోదు
చౌడేపల్లె ముచ్చట్లు:
ఇంటినుంచి పాఠశాలకు వెల్లొస్తామని బయలుదేరి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లితండ్రుల ఫిర్యాధు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్ఐ రవికుమార్ సోమవారం తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు 29 ఏ చింతమాకులపల్లె పంచాయతీ బయ్యప్పల్లెకు చెందిన సి. ఆకాష్(16) ఇంటర్ సెకండ్ ఇయర్, ఎంసీవి కళాశాల పుంగనూరు,కె. చందు(14) 9 వతరగతి పుంగనూరు లో చదువుతున్నారు. వీరిద్దరు పాఠశాలకు వెళ్లి రాకపోవడంతో చుట్టుప్రక్కలా వెతికినా ఆచూకీ తెలియక పోలీసులను ఆశ్రయించారు. సమాచారం తెలిసిన వారు 9440900698 కు సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
Tags: A case of disappearance of two students has been registered in Chaudepalle

