పొన్నవోలు పై కేసు నమోదు చేయాలి

రాజమండ్రి ముచ్చట్లు:


ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూర్‌ సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ చౌదరి డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎటువంటి సాక్షాదారులు లేకుండా కేసులు నమోదు చేసి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్‌ జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి సీఐడీలను ప్రయోగించి ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు.. తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేసిన జడ్జిని ఆయన ఇచ్చిన జడ్జిమెంట్‌ను తప్పుబడుతూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడటం కోర్టు ధిక్కరణ అవుతుందన్నారు. ముందు కేసులు పెట్టి తరువాత విచారణ చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు.

 

Tags: A case should be registered against Ponnavolu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *