రాజకీయ ప్రతీకారం తీర్చుకునే ఆయుధంలా తయారైన సీబీఐ

A CBI made as a weapon for political retribution

A CBI made as a weapon for political retribution

– కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ
Date:22/10/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో.. కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) రాజకీయ ప్రతీకారం తీర్చుకునే ఓ ఆయుధంలా తయారైందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఓ అవినీతి కేసులో తాజాగా సీబీఐ… తమ సొంత శాఖ డైరెక్టర్ రాకేశ్‌ అస్తానాపై కేసు నమోదు చేసింది. ఈ విషయంపై స్పందించిన రాహుల్‌… ‘ప్రధాని మోదీకి అనుకూలంగా వ్యవహరించే గుజరాత్‌ క్యాడర్‌ అధికారి, గోద్రా పత్యేక దర్యాప్తు బృంద చీఫ్‌ ఇప్పుడు లంచం తీసుకున్న కేసులో దొరికిపోయారు.
మోదీ నాయకత్వంలో రాజకీయ ప్రతీకారం తీర్చుకునే ఆయుధంలా సీబీఐని వాడుకుంటున్నారు. తమపై తామే యుద్ధం జరుపుకొనేలా ఆ వ్యవస్థను తయారు చేశారు’ అని ట్వీట్‌ చేశారు.కాగా, మాంసం ఎగుమతి చేసే వ్యాపారవేత్త మోయిన్‌ ఖురేషిపై మనీలాండరింగ్‌, అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు రాగా ఆయనపై సీబీఐ విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ కేసులో రాకేష్‌ అస్తానా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం (సిట్‌) ఏర్పాటైంది. అయితే, ఖురేషి నుంచి ఆయన లంచం డిమాండ్‌ చేసి తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ కేసులో అస్తానాను నంబర్‌.2 గా పేర్కొంటూ సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. అంతేగాక, ఇందులో సిట్ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్ అధికారిపై కూడా కేసు నమోదైంది.
మరోవైపు, ఫిబ్రవరి 2002లో గోద్రాలో శబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలును తగులబెట్టిన కేసులో దర్యాప్తు జరిపిన బృందానికి కూడా 1984 బ్యాచ్‌కి చెందిన గుజరాత్‌ క్యాడర్ అధికారి అస్తానా చీఫ్‌గా వ్యవహరించారు. ఆయన మోదీకి అత్యంత సన్నిహితుడని కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తోంది.
Tags:A CBI made as a weapon for political retribution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *