మారుతున్న ” అనంత ”  సాగు – అందని ప్రభుత్వ సాయం

జిల్లా రైతులను ముంచిన వేరుశనగ

విచ్చలవిడిగా చొరబడుతున్న ” కార్పొరేట్‌ ” కంపెనీలు

అనంతపురం ముచ్చట్లు:

Post Midle

జిల్లా రైతులు తమ స్వంత అనుభవంతో కొద్దిపాటి నీటి వనరులతో, పరిమితమైన ఆర్థిక శక్తితో వైవిధ్యంతో కూడిన పంటలు పండిస్తుంటే వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు దగా చేస్తున్నాయి. కార్పొరేట్‌ కంపెనీలు ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా జొరబడుతున్నాయి. రిలయన్స్‌, బిర్లా మోర్‌, వెజిటబుల్‌ బాస్కెట్‌, బిగ్‌ బాస్కెట్‌ లాంటి అనేక కంపెనీలు ముందస్తుగా పండ్లతోటల రైతులతో ఒప్పందాలు చేసుకుని, ఆ రైతులకు రుణాలు, పరుగు మందులు, పంట పర్యవేక్షణ లాంటి రూపాల్లో రైతులకు వల వేస్తున్నాయి. ప్రభుత్వం నుండి సహకారం లేకపోవడంతో రైతులు అనివార్యంగా ఈ కంపెనీల మీద ఆధారపడాల్సి వస్తోంది.  రాష్ట్రంలో అత్యంత కరువు జిల్లా అయిన అనంతపురం జిల్లాలో ఒకనాడు కొర్రలు, జొన్నలు లాంటి ఆహారధాన్యాలు మాత్రమే పండించారు. 1980 తర్వాత రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా వేరుశనగ పంట సాగయింది. ఒక దశలో ఖరీఫ్‌లో సాగయిన మొత్తం భూమిలో 98 శాతం వేరుశనగ పంట మాత్రమే పండించే పరిస్థితి ఏర్పడింది. గత ఆరేడు సంవత్సరాలుగా ఉద్యానపంటల సాగు పెరిగి నేడు విభిన్న రకాల పండ్లు, పూలు పండిస్తూ అనంత జిల్లా…రాష్ట్ర పండ్లతోటల కేంద్రంగా మారింది. ఎడారి నుండి మంచు పర్వతాల వరకు ఎక్కడ ఏ పంటలు పండుతాయో వాటన్నింటినీ ఈ జిల్లాలో పండించేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ఈ మార్పులకు తోడుగా రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు తమ విధానాల వల్ల ఆటంకాలు కలిగిస్తున్నాయి. రిలయన్స్‌, అదానీ, బిర్లా మోర్‌ లాంటి కార్పొరేట్‌ సంస్థలు ఇక్కడ పండుతున్న పండ్లు, కాయగూరలు, పూల కొనుగోలులోకి జొరబడి క్రమంగా తామే పంటలు సాగు చేయడానికి, కాంట్రాక్టు వ్యవసాయానికి సిద్ధమవుతున్నాయి.

 

Tags: A changing “infinite” cultivation
– Non-receipt of government assistance

Post Midle