ప్రణయ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు

Date:12/06/2019

నల్లగొండ ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో పోలీసులు బుధవారం  ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. గతేడాది సెప్టెంబరు 14న మిర్యాలగూడ లో పెరుమాళ్ళ ప్రణయ్ పట్టపగలే దారుణహత్య కు గురైన విషయం తెలిసిందే. తమ కూతుర్ని ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేకనే అమృత తండ్రి మారుతిరావు,   ప్రణయ్ ను హత్య చేయించాడని పోలీసులు చార్జీషీట్ లో పేర్కోన్నారు.  ఘటన తరువాత నుంచి జైలులో వున్న మారుతిరావు, అమృత బాబాయి శ్రావణ్, మరొక నిందితుడు కరీం ఇటీవలే బెయిల్ పై విడుదల అయ్యారు. హత్య జరిగిన దాదాపు 9 నెలల
తర్వాత పోలీసులు  ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. మొత్తం 1600 పేజీల ఛార్జ్ షీట్ ను సిద్ధం చేసారు.

 

ఇంద్రకీలాద్రిలో ఘనంగా అక్షరభ్యాసాలు

Tags: A charge sheet filed in the case of Pranay

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *