గోడకూలి చిన్నారి మృతి
గుడివాడ ముచ్చట్లు:
గుడివాడ మండలం శేరి దింటకుర్రులో విషాదం చోటుచేసుకుంది, గోడ కూలి ఆరేళ్ల చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అంగన్వాడిలో ప్రైమరీ చదువుతున్న బాపట్ల మధులత, తరగతులు ముగించుకొని తన ఇంటికి వచ్చి ఆడుకుంటుండగా, ప్రమాదవశాత్తు గోడ కూలడంతో చిన్నారి శిధిలాల కింద ఇరుక్కుపోయింది. గ్రామస్తుల సహకారంతో గోడ శిధిలాలను తొలగించిన కుటుంబ సభ్యులు,తీవ్రంగా గాయపడిన మదులతను గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చిన్నారి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విగతా జీవిగా పడి ఉన్న చిన్నారిని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. చిలక పలుకులతో అందరితో సరదాగే మాట్లాడే మధులత మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Tags:A child died after a wall collapsed

