ట్రాక్టర్ ఢీకొని చిన్నారి దుర్మరణం

తంబళ్లపల్లె ముచ్చట్లు:

 

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన విషాదకర ఘటన శనివారం కోసువారిపల్లిలో జరిగింది. తంబళ్లపల్లె ఎస్సై శివకుమార్ కథనం మేరకు.. మండలంలోని కోసువారిపల్లెకు చెందిన దంపతులు చరణ్, నందిని ల కుమార్తె రూప(2) ఇంటి ముందు ఆడుకుంటుండగా, ట్రాక్టర్ ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలని కుటుంబీకులు చికిత్స కోసం వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించే లోపే చిన్నారి మృతి చెందింది.

 

Tags: A child dies after being hit by a tractor

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *