Natyam ad

ఓ కొరియోగ్రాఫర్‌.. నకిలీ పోలీస్‌ అవతారo

రాయదుర్గం ముచ్చట్లు:

 

ఓ కొరియోగ్రాఫర్‌.. నకిలీ పోలీస్‌ అవతారమెత్తాడు. మసాజ్‌ సెంటర్‌లు, స్పాలను లక్ష్యంగా చేసుకుని అక్రమ వసూళ్లకు తెరతీసి చివరికి కటకటాలపాలయ్యాడు. పోలీస్‌ ఇంటెలిజెన్స్‌ డిటెక్టివ్‌ ఆఫీసర్‌ పేరుతో నకిలీ గుర్తింపుకార్డు తయారు చేసుకుని బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని మాదాపూర్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. గుడిమల్కాపూర్‌ ప్రాంతానికి చెందిన మారికొండ సాయి కిరణ్‌ తేజ(30) వృత్తిరీత్యా నృత్య దర్శకుడు. అతను క్రైం ఇంటెలిజెన్స్‌ డిటెక్టివ్‌ ఆఫీస్‌ర్‌ పేరుతో నకిలీ గుర్తింపు కార్డును తయారు చేశాడు. ఆన్‌లైన్‌లో రాయదుర్గం, మాదాపూర్‌తోపాటు వివిధ ప్రాంతాల్లోని స్పాలు, మసాజ్‌ సెంటర్ల ఫోన్‌ నంబర్లు సేకరించి ఫోన్‌ చేసి సేవలపై ఆరా తీశాడు. అక్కడికెళ్లి గుర్తింపు కార్డు చూపించి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. రాయదుర్గం ఠాణా పరిధిలోని స్టార్‌ వెల్‌సెన్‌ స్పా అండ్‌ఫ్యామిలీ సెలూన్‌లో సిబ్బందిని బెదిరించి రూ.10వేలు వసూలు చేశాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని పట్టుకున్నారు. అతడిని విచారించగా అంతకుముందు రిలాక్స్‌ బ్యూటీ అండ్‌ స్పా నుంచి రూ.5వేలు వసూలు చేసినట్లు వెల్లడించాడు. నిందితుడి నుంచి రూ.10వేల నగదు, సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం మంగళవారం రాయదుర్గం పోలీసులకు కేసు అప్పగించారు.

 

Tags: A choreographer.. a fake police avatar

Post Midle
Post Midle