మహిళ మంత్రి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సహచర మంత్రి

Date:12/02/2019
అగర్తల ముచ్చట్లు:
ఓ మహిళ మంత్రి పట్ల సహచర మంత్రి అసభ్యంగా ప్రవర్తించడం కలకలంరేపింది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి పాల్గొన్న సభలోనే ఘటన జరగడం.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడం తీవ్ర దుమారాన్ని రేపింది. బాధ్యాతాయుతమైన పదవిలో ఉండే ఇదేం బుద్ది అంటూ ప్రతిపక్షాలతో పాటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ శనివారం త్రిపురలో పర్యటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్‌తో కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రధాని పర్యటనలో భాగంగా అగర్తలలో ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రధాని శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తుండగా.. ఆ వేదికపై రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మనోజ్ కాంతి దేవ్.. మహిళా మంత్రి పక్క, పక్కన నిలబడ్డారు. ఆ సమయంలో మహిళా మంత్రిని అసభ్యంగా తాకారు. ఈ వీడియో రెండు రోజుల తర్వాత సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. వివాదం రేగింది. మనోజ్‌ కాంతి దేవ్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని బీజేపీ మండిపడింది. ఆ వీడియో బూటకమని కొట్టిపారేశారు. అలాగే సదరు మహిళా మంత్రి నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని గుర్తు చేస్తున్నారు.
Tags:A colleague who is obsessed with the woman’s minister

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *