A collection of dolls during the Navami celebrations

నవమి సంబరాలలో బొమ్మల కొలువు

Date:21/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

నవరాత్రి వేడుకల్లో భాగంగా ఐదవ రోజు వివిధ ఆలయాలలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. బుధవారం పట్టణంలోని పలువురు తమ ఇండ్లలో బొమ్మల కొలువు దీర్చి పూజలు చేశారు. బృందావనంలోని తులసిచెట్టును అలంకరించి, సరస్వతిదేవి పూజలు నిర్వహించారు. బస్టాండు వద్ద గల శ్రీ విరూపాక్షి మారెమ్మను పత్తితో అలంకరించారు. అలాగే పట్టణంలోని బజారువీధిలో గల శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకారించారు. మాదనపల్లెలో శ్రీషిరిడిసాయిబాబాను , చెరువు కట్టపైన, కొత్తయిండ్లలో గల సాయిబాబా ఆలయంలో కూడ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలలో దసరా పూజలు సందర్భంగా ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించి, వేకువజాము నుంచి పూజలు, హ్గమాలు , అభిషేకాలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఆలయాలు భక్తులకు కిటకిటలాడింది. భక్తులకు ఆలయ ధర్మకర్తలు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

కరోనా నియంత్రణ కోసం కృషి చేద్దాం

Tags; A collection of dolls during the Navami celebrations

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *