Natyam ad

సామాన్యుడు మహాత్ముడయ్యాడు

-అయన వారసులుగా మనం గర్వించాలి సి జె ఐ

తిరుపతి ముచ్చట్లు:

అహింసా మార్గంలో దీర్ఘకాలిక స్వాతంత్ర ద్యమం నడిపిన సామాన్యుడు గాంధీ గారు  మహాత్ముడు డయ్యాడయ్యాడని, నేడు అయన వారసులుగా మనం గర్వించాల్సిన విషయం అని భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ నూతలపాటి వెంకటరమణ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక రాహుల్ కన్వెన్షన్ సెంటర్ లో సత్యశోధన మహాత్ముని ఆత్మకథ అనువాదం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ముఖ్యాతిధిగా పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మానవుడు మహాత్మునిగా మారిన గాంధీ చరిత్రను వాస్తవాలకు అనుగుణంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రచురించి భవిష్యత్ తరాలకు అందించాలనే తపన స్థానిక శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి రావడం సంతోషమని , అభినందిస్తున్నానని అన్నారు. తిరుపతి పట్టణంలో మహాత్మాగాంధీ గారు రెండు సార్ట్లు పర్యటించారని తిరుపతి వాసులు అదృష్టవంతులని అన్నారు. నేడు  కరుణాకరరెడ్డి పుస్తక అనువాదం ప్రచురించి ఆవిష్కరణకు ముఖ్యాతిధిగా పిలవడం సంతోషంగా వుందని అన్నారు. ప్రపంచంలో అనేకమందికి గాంధీ గారి అహింస శాంతి మార్గాలతో చెడును గట్టిగా ప్రతిఘటించి ద్వేషంతో కాకుండా ప్రేమతో , రక్తపాతం లేకుండా దీర్ఘకాలిక ఉద్యమంతో స్వాతంత్ర్యం ఉద్యమంలో పోరాడారని తెలుసని  అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నిజం చెప్పడం ఎంత కష్టమో ,

 

Post Midle

చేసిన తప్పును అందరి సమక్షంలో సభా వేదికగా   ఒప్పుకోవడం అనేది భూమన కరుణాకరరెడ్డి నిబద్దతలో నాకు మాటలు రావడం లేదు, ఏవిధంగా గౌరవించాలో కూడా అర్థంకాలేదు అన్నారు. నాకు ఆప్తమిత్రులు భూమన , పిన్నవయస్సులో తీవ్రవాద వామపక్షాన నిలిచి రెండు సంవత్సరాల జైలు జీవితం అతి పిన్న వయస్సులో అనుభవించి, అక్కడే అనేక మంది సాహితీ వేత్తల విప్లవకారులతో గడిపారని అన్నారు. ఆ స్పూర్తితో ప్రజల సమస్యలను విశాల దృక్పదంతో పార్టీల కతీతంగా, నిర్మొహమాటంగా చెప్పడం అనేది సామాన్యవిషయం కాదు, ఎప్పడు నావద్దకు వచ్చినా సమాజ శ్రేయస్సు గురుంచి ప్రసావిస్తారే తప్ప నాకిది చేసిపెట్టు అని ఏనాడు అడగలేదు అన్నారు. నా  అభిమాని, స్నేహితుడు, ఆప్తమిత్రుడు అపూర్వ సహోదరుడు రాజకీయాల్లో న్యాయకత్వ విలువలు కలిగిన వ్యక్తి భూమన అని, అన్నిరకాల మనం  అండగా వుండాలని కోరుకుంటున్నానని అన్నారు. భూమన అధ్వర్యంలో తిరుపతిలో బాషా సాహితీ సదస్సు జరపాలని ఆకార్యక్రమానికి వస్తానని అన్నారు.

 

Tags: A common man became a Mahatma

Post Midle

Leave A Reply

Your email address will not be published.