పైడిరాజు మరణం ఫై సిబిఐచే సమగ్ర విచారణ జరిపించాలి

Date:18/09/2018
ఐహెచ్ఆర్ఏ డైరెక్టర్ కరణం తిరుపతి నాయుడు డిమాండ్
హైదరాబాద్ ముచ్చట్లు :
ఈ నెల 11 న విశాఖ పట్టణం సెంట్రల్ క్రైమ్ పోలీసు స్టేషన్(సిసిఎస్) లో  మృతి చెందిన గొర్లె పైడి రాజు మరణం ఫై సిబిఐచే సమగ్ర విచారణ జరిపించాలని అంతర్జాతీయ  మానవ హక్కుల సంఘం (ఐహెచ్ఆర్ఏ)ఏపి రాష్ట్ర డైరెక్టర్ కరణం తిరుపతి నాయుడు నేడొక ప్రకటనలో డిమాండ్ చేసారు.పైడి రాజు పాత నేరస్తుడు కావడం తో విచారణ నిమిత్తం అతన్ని 11 వ తేదికి ముందే పోలీస్ స్టేషన్ కు తీసుక వచ్చి విచారణ పేరుతో తర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్ర హింసలకు గురి చేయడం వల్లే చని పోయాడని ఆయన ఆరోపించారు.
లాకప్ లో చని పోయిన పైడి రాజు మృతి ని కప్పి పుచ్చడానికి చని పోయిన అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తెసుకెల్లి చికిత్స చేయించి నట్లు నటించి చికిత్స పొందుతూ మరణించినట్లు సర్టిఫికేట్ తెచ్చారని తిరుపతి నాయుడు ఆరోపించారు.మంగళవారం మద్యాన్నం రహస్యంగా శవాన్ని పోలిస్ స్టేషన్ నుండి తరలించి అటు ఇటు త్రిప్పి రాత్రి 9 గంటల సమయం లో మార్చరికి తరలించడం లో గల అంతర్యమేమిటని నాయుడు ప్రశ్నించారు.
లాకప్ లో అనుమానాస్పదంగా మృతి చిందిన వారికి పోస్ట్ మార్టన్ నిర్వహించడం సాదారణం ఐనప్పటికీ పైడి రాజు కు ఎందుకు పోస్ట్ మారటం నిర్వహించలేదని తిరుపతి నాయుడు ప్రశ్నించాడు.పైడి రాజును అతని భార్యకు అప్పగించామని ఒకరు, లాకప్ లో చనిపోలేదు అని ఒకరు ఇలా పోలీసులు ఒకరికొకరు పొంతనలేని సమాదానాలు ఇవ్వడం పైడి రాజు మృతి ఫై అనుమానాలకు మరింత బలం చేకురుస్తుందని పేర్కొన్నారు.
అంతే కాకుండా అతని కుటుంబ సబ్యులను భెదిరించి వారితో సెటిల్ మెంట్ చేసుకొని వారు ఊరు పారి పోయీల చేసారని ఆరోపించారు.ఈ సంఘటనకు భాద్యులైన వారిని వెంటనే సస్పెండ్ చేయాలని,ఈ కేసును సిబిఐ కి అప్పగించి విచారణ జరిపించాలని తిరుపతి నాయుడు డిమాండ్ చేసారు.రాష్ట్రము లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే పాలకులు చూసి చూడనట్లు వ్యవహరించడమే కాకుండా పోలీసులకు అండగా నిలువడం దారుణమని  విమర్శించారు.
Tags:A comprehensive inquiry should be conducted by CBI on the death of the pedigree

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *