Natyam ad

అవినీతి రహిత సమాజం- కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి

జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్

కడప ముచ్చట్లు:

 

న్యాయం కోసం పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మన వద్దకు వచ్చినప్పుడు అన్ని పనులను నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహించి ప్రజా ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేయాలని జిల్లారెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ అన్నారు శనివారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన సమావేశ హాలు నందు అవినీతి నిరోధక శాఖ, కడప వారి ఆధ్వర్యంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు,2022జరిగాయి.ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి గంగాధర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మనమందరం ప్రభుత్వ ఉద్యోగుల మని బాధ్యతాయుతంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకునిజాయితీగా, పారదర్శకంగా న్యాయం అందించేందుకు నిరంత రం కృషి చేయాలని అన్నారు. మన వద్దకు ఎంతోమంది పేద ప్రజలు రావడం జరుగుతుందని ప్రభుత్వ ము నిర్దేశించిన గడువు మేరకు వారికిసేవలు అందించాలని, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, చట్ట పరిధిలో అందరికీ సమ న్యాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజల కోసమే పని చేయాలని చెప్పారు.డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ పెద్దిరాజు మాట్లాడుతూ మంచితనానికి కులం లేదు, మతం లేదని ప్రతి పేదవాడికి న్యాయం చేసే మనస్సు కలిగి ఉండాలని అన్నారు. ఉద్యోగ భాధ్యతను గుర్తేరిగి మనమందరం పనిచేయాలని, పేదవాడికిసకాలంలో సహాయం అందించాలని అన్నారు.అవినీతి నిరోధక శాఖ సబ్- ఇన్స్పెక్టర్ నౌషాద్ మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానమేనని, ప్రభుత్వ ఉద్యోగులమైన మనమందరం ప్రజలకు
జవాబుదారీతనంతో పని చేయాలని అన్నారు. పేద ప్రజలు న్యాయం కోసం మన వద్దకు వచ్చినప్పుడు వారికి నిజాయితీగా పారదర్శకంగా న్యాయమందిం చాలని అన్నారు.అనంతరం జిల్లా రెవెన్యూ అధికారిగంగాధర్ గౌడ్ అందరితో అవినీతిని అరికడదాం దేశాభివృద్ధికి పాటుపడదాం అని ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో సీపీవో వెంకట్రావు, స్పెషల్ కలెక్టర్లు మోహన్ రావు, శాంత కుమారి, డిప్యూటీ కలెక్టర్ఎం. సి. నరసింహులు, కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి విజయ్ కుమార్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: A corruption-free society – everyone should work together

Post Midle

Leave A Reply

Your email address will not be published.