పులివాగులో దూకి దంపతుల ఆత్మహత్య

మైలవరం ముచ్చట్లు:


ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం, జి.కొండూరు మండలం,  గడ్డమణుగు గ్రామ శివారులోని పులివాగులో దూకి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.మునగపాడు గ్రామానికి చెందిన పణితి తిరుపతిరావు(32) కు విజయవాడకు చెందిన కుసుమ(28)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది.తిరుపతిరా వు గుంటుపల్లి గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం గొల్లపూడిలోని బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన తిరుపతి రావు,కుసుమలు సాయంత్రం సమయంలో మునగపాడు గ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు.రాత్రి ఏడు గంటల సమయంలో గడ్డమణుగు గ్రామ శివారులోని పులివాగు వద్దకు చేరుకున్నారు.ఏం జరిగిందో తెలియదు కాని ద్విచక్రవాహనాన్ని వంతెనపై ఉంచి భార్యాభర్తలు ఇద్దరూ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న దంపతుల కుటుంబ సభ్యులు,బంధువులు,పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.గజ ఈతగాళ్ల సాయంతో ఇద్దరి మృతదేహాల ను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అయితే వారి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

 

Tags: A couple committed suicide by jumping into the river

Leave A Reply

Your email address will not be published.