లారీ ఢీకొని దంపతులు మృతి

భీమవరం ముచ్చట్లు:


పశ్చిమ గోదావరి  జిల్లాలోని  భీమవరం – ఉండి రహదారిలో ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న. బైక్ ను ఐషర్ లారీ ఢికొంది. ఘటనలో   ఇద్దరు మృతి చెందారు. సంఘటనా స్థలంలోనే చింతా పంతులు (43) మృతి చెందగా. ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  భార్య వరలక్ష్మి (38) మరణించింది. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామానికి చెందిన దంపతులు బైక్ పై ఆకివీడు నుండి స్వగ్రామం వెళుతుండగా ప్రమాదం జరిగింది. వారితో వున్న రెండేళ్ల బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. భీమవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags: A couple died after being hit by a lorry

Leave A Reply

Your email address will not be published.