ఖనాపూర్ లో డొంక మాయం.

ఖమ్మం ముచ్చట్లు:
వ్యవసాయం దండిగా సాగిన కాలంలో ఎడ్లబండ్లు వెళ్లేందుకు వేసిన డొంక అది. ఆ తర్వాత పచ్చటి పంట పొలాలు రియల్‌ ఎస్టేట్‌ ఉచ్చులో పడి వెంచర్లుగా మారాయి. ఈ క్రమం లో వాగులూ, వంకలే కాదు.. డొంకలూ మా యమయ్యాయి. రియల్‌ బూచోళ్లు రాత్రింబగళ్లు ఆక్రమణల పర్వం సాగించిన ఫలితంగా రూపు కోల్పోయి కనుమరుగయ్యిందే ఖానాపురం రెవెన్యూ డొంక. ఇటీవల డొంక ఆనవాళ్లను పరిశీలించిన ఖమ్మం తహసీల్దార్‌ అక్కడ శాశ్వత భవనాలను చూసి నివ్వెరపోయారు. అయితే డొంక పక్కనే సొంత స్థలాలున్న వారికీ ఆక్రమ ణదారుల నుంచి వేధింపులు తప్పడం లేదు. దందాకోరుల బెదిరింపులకు తాళలేక కంటిపై కనుకులేని స్థితిని అనుభవిస్తున్నారు.నలుదిక్కులా విస్తురిన్న నగరం ఖమ్మం. ఈ అభివృద్ధి క్రమంలోనే భూ ఆక్రమణలు, దందాకోరుల బెడద కూడా బాగా పెరిగింది. ప్రభుత్వ భూములను దాదాపుగా ఆక్రమించేయ గా చెరువులు, కుంటలు, వాగులు, వంకలనూ భాదాహంతో మాయం చేసేశారు. ఇలా ఆనవా ళ్లు కోల్పోయిన ప్రభుత్వ భూమి జాబితాలోనే ఖానాపురం పురాతన డొంక ఒకటి. ఖమ్మం అర్బన్‌ పరిధి ఖానాపురం రెవెన్యూ సర్వే నెంబర్‌ 321లో 33అడుగుల వెడల్పుతో కిలోమీటర్ల పొడవున ఉన్న రెవెన్యూ డొంక ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. ఇల్లెందు ప్రధాన రహదారికి ఆనుకుని ప్రభుత్వ డొంక ఉండటంతో దానిపై రియల్‌ ఎస్టేట్‌ మాయగాళ్ల కన్ను పడింది. దీంతో రూ.కోట్ల విలువ చేసే డొంక భూమిని కబ్జా చేసేశారు. తప్పుడు డాక్యుమెంట్ల సృష్టిలో మనోళ్లది అందెవేసిన చేయి కావడంతోడొంకకు సైతం తమ పేర్లతో డాక్యుమెంట్లు సృష్టించుకుని పాగా వేసేశారు. ఫలితంగా అక్కడ ఇప్పుడు పక్కా భవనాలు వెలిశాయి. ఇంకొందరు ప్రహరీలు నిర్మించుకుని ఈ భూమి తమదేనన్న ధీమా చూపిస్తున్నారు. దీంతో ఆ డొంక హద్దులను సైతం గుర్తించలేని స్థితిలో రెవెన్యూ యంత్రాంగం కొట్టుమిట్టాడుతోంది. అధికారులు కాస్త ఏమరపాటుగా ఉన్న ఫలితంగా డొంక కనుమరుగైంది.ప్రభుత్వ డొంకను ఆక్రమించేశారు సరే.. ఆ డొంక పక్కనే సొంత స్థలం ఉన్న వారినీ బెదిరించి ఎంచక్కా కలిపేసుకునేందుకు కొందరు ఇంకా పన్నాగాలు పన్నుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడి కొందరు పెద్దల అండదండతో ఎప్పట్నుంచో ఉన్న స్థానికులకు సైతం హుకుం జారీ చేస్తున్న తీరు ఔరా..! అనిపిస్తుంది. గతంలో ప్రజా ప్రతినిధులుగా పదవిలో కొనసాగిన వారిపై దౌర్జన్యకాండసాగిస్తున్నారంటే కబ్జాకోరుల భూ దాహం ఏపాటిదో అర్దమవుతోంది. డొంక సర్వే నెంబర్‌ అయిన 321లో వంద గజాల స్థలం ఉన్నా దానిపై ఎప్పుడు ఎవరు కన్నేస్తారోనన్న జంకుతో భయబ్రాంతులకు లోనవుతున్న దుస్థితి నెలకొంది.డొంకను ఆనుకుని ఖానాపురం సర్వే నెంబర్‌ 321లో 300 గజాల స్థలాన్ని 2011లో కొనుగోలు చేశాం. డొంకతో పాటు తమ ప్లాటుకు మరో సర్వే నెంబర్‌ చూపుతూ మల్లయ్య అనే వ్యక్తి తమ ప్లాటును ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు. హవేలీ పంచాయతీలో మాజీ వార్డు సభ్యురాలినైన నాకు కూడా ఆక్రమణదారుల నుంచి బెదిరింపులు తప్పట్లేదు. ఈ వ్యవహారంపై ఇప్పటికే రెవెన్యూ, కార్పొరేషన్‌ అధికారులకు ఫిర్యాదు చేశాం. దౌర్జన్యంగా తమ భూమిలో నిర్మాణాలు చేపట్టేందుకు సైతం ప్రయత్నించారు. పోలీస్‌ కమిషనర్‌, కలెక్టర్‌ వద్ద కూడా మొర పెట్టుకున్నాం. ఇప్పటికైనా తమ భూమిని కబ్జాకోరుల నుంచి కాపాడాలి.
 
Tags:A detour in Khanapur

Leave A Reply

Your email address will not be published.