దుమ్ము రేపుతున్న లైగర్

హైదరాబాద్ ముచ్చట్లు:


రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న లైగర్  సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో జూలై 21న విడుదలైన లైగర్ ట్రైలర్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేసింది. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ బాక్సార్‏గా పవర్ ఫుల్ లుక్‏లో కనిపిస్తున్నారు. ఇక ట్రైలర్‏లో విజయ్ మేకోవర్.. డైలాగ్ డెలివరీ.. రమ్య కృష్ణ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ”ఒక లయిన్ కి టైగర్ కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సర్ నా బిడ్డ” అనే రమ్యకృష్ణ వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం గూజ్ బమ్స్ మూమెంట్స్ తో అద్భుతం అనిపించింది. ఫైటింగ్ రింగ్ లో విజయ్ చేసిన పోరాటాలు ఎక్స్ ట్రార్డినరీగా వున్నాయి. ముఖ్యంగా విజయ్ పాత్రకి నత్తి వుండటం బిగ్ సర్ప్రైజ్, ఛాలెంజ్. ట్రైలర్ లో లైగర్ లవ్ లైఫ్ ని కూడా అవిష్కారించారు. ‘ఐ లవ్ యూ’ అనే మాటని లైగర్ చెప్పిన విధానం అవుట్ స్టాండింగా వుంది. విడుదలైన గంటల్లోన్నే మిలియన్స్ వ్యూస్‏తో దూసుకుపోయింది ఈ ట్రైలర్.ఇక తాజాగా యూట్యూబ్ ట్రెండింగ్‏లో ఫస్ట్ ప్లేస్‏లో దూసుకుపోతుంది. 24 గంటల్లోనే 50 మిలియన్ వ్యూస్.. 1.5 మిలియన్ లైక్స్‏తో ట్రైలర్ ఆఫ్ ది ఇయర్‏గా నిలిచింది. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్‏తో ధర్మ మూవీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, ఛార్మి, పూరి సంయుక్తంగా ఈ చత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే లైగర్ ట్రైలర్ పై.. విజయ్, పూరి కాంబోపై మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ పొగడ్తలు కురిపించారు.

 

Tags: A dusty liger

Leave A Reply

Your email address will not be published.