ఏనుగుల దాడి…. ఓ రైతు మృతి

చిత్తూరు ముచ్చట్లు:


పులిచెర్ల మండలంలో  ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఎర్రపాపిరెడ్డిగారి పల్లి వద్ద ఏనుగులు గుంపు రైతులపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. రైతులు ఏనుగులను తరిమే ప్రయత్నంలో ఏనుగుల గుంపు తిరగబడి, గొర్రల కాపరి మస్తాన్ ను ఓ ఏనుగు తొండంతో కొట్టడంతో మస్తాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఏనుగులు తరచు తమ పంట పొలాలపై దాడులు చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటపొలాలను ఏనుగుల దాడుల నుండి అధికారులు కాపాడాలని రైతులు వాపోతున్నారు. పంటపొలాలే కాకుండా తమ ప్రాణాలను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోస్ట్ మార్టం నిమ్మితం మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలించారు.

Tags: A farmer was killed in an attack by elephants

Post Midle
Post Midle