కొన్ని నిమిషాల ధ్యానం.. ఉత్తేజితుల్ని చేస్తుంది: ప్రధాని నరేంద్ర మోదీ..
మైసూర్ ముచ్చట్లు:
యోగా ఏ ఒక్కరికో చెందినది కాదు.. అందరిదనీ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యోగా తో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడుతుందని చెప్పారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటక లోని మైసూరు లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు.యోగాను గుర్తించిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) సహా ప్రపంచ దేశాలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు.‘‘భారత ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తుంది. కొన్ని నిమిషాల పాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది. యోగా దినోత్సవం.. ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచిక. ప్రస్తుతం యోగా ప్రపంచం నలుమూలలా విస్తరించింది. కరోనా విపత్తు సమయం లోనూ దీన్ని నిర్వహించాం. సమాజం లో శాంతి నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుంది.. జీవన విధానానికి మార్గంగా నిలుస్తుంది. ఇది వ్యక్తికే పరిమితం కాదు.. సకల మానవాళికి ఉపయుక్తమైనది. యోగా సందేశాన్ని సకల మానవాళికి చేర వేయాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

Tags: A few minutes of meditation .. makes it exciting: Prime Minister Narendra Modi ..
