Natyam ad

ఎఫ్ఆర్వో శ్రీనివాస రావుకు అంతిమ వీడ్కోలు

ఖమ్మం ముచ్చట్లు:

ఈర్లపుడిలో మంత్రులు పువ్వాడ, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లతో కలిసి నివాళులు అర్పించిన రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అంతిమ యాత్రలో మంత్రులతో కలిసి పాడె మోసిన ఎంపీ రవిచంద్ర. మంత్రులు రఘునాధపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాస రావు భౌతిక‌కాయానికి మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి లతో కలిసి రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాళులర్పించారు.
శ్రీనివాస రావు కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చి, మనో ధైర్యం కల్పించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుందని వారంతా  భరోసా నిచ్చారు.
గ్రామంలో శ్రీనివాస రావు అంతిమ యాత్రలో పాల్గొని, మంత్రులు పాడే మోశారు.
ఈ కార్యక్రమంలో , కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య , ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, అశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం తదితరులు పాల్గోన్నారు.

 

Tags: A final farewell to FRO Srinivasa Rao

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.