పుంగనూరులో మత్తులో వాహనాలను నడిపిన వారికి రూ.10 వేలు జరిమాన
పుంగనూరు ముచ్చట్లు:
మధ్యం మత్తులో ద్విచక్రవాహనాలను నడిపిన ఇద్దరు వ్యక్తులకు కోర్టు రూ.10 వేలు జరిమాన విధించిందని ఎస్ఐ మోహన్‌కుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. పట్టణంలోని కొత్తపేటకు చెందిన మనగాని మోహన్‌కృష్ణ, మండలంలోని నల్లూరుపల్లెకు చెందిన సుబ్రమణ్యంరెడ్డిలు మధ్యంమత్తులో ద్విచక్రవాహనాలను నడుపుతుండగా పట్టుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి సిందు ఒకొక్కరికి రూ.10 వేలు జరిమాన విధించినట్లు ఆయన తెలిపారు. పట్టణంలో మధ్యం సేవించి ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Tags: A fine of Rs 10,000 was imposed on a drunk driver in Punganur
