Natyam ad

ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం

నల్గోండ ముచ్చట్లు:


నల్గొండ బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలోని చందక్ కెమికల్ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ప్రమాదం జరిగిన ప్రదేశం లో భారీగా మంటలు ఎగిసిపడడంతో కార్మికులు సమీప నివాస ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే రెండు ఫైర్ ఇంజన్‌లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్య వల్లనే ప్రమాదం జరిగినట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. ఈ ఘటనలో ఒక కార్మికునికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా ఈ కంపెనీలో ప్రమాదం జరగడం ఇది రెండోసారి కావడంతో అధికారులు స్పందించి ఇటువంటి కంపెనీలపై చర్యలు తీసుకొని తమ ప్రాణాలను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

 

Tags: A fire accident in a pharma company

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.