దొరల ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి –  ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి

A foolish government should be told - to establish a public government

A foolish government should be told - to establish a public government

కల్వకుర్తిని వద్దన్న వ్యక్తి.. ఇప్పుడు మేమే తెచ్చాం అంటున్నారు
తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను అమ్మనా- బొమ్మనా అన్న దౌర్భాగ్యులకు బుద్ది చెప్పాలి
–  ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు
Date:12/10/2018
కొల్లాపూర్  ముచ్చట్లు:
తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఇక్కడి ప్రజలంతా అమ్మలా చూస్తారని.. అటువంటి అమ్మను, అమ్మనా బొమ్మానా అన్న దౌర్భాగ్యులకు బుద్ది చెప్పాలని ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ది చెప్పేందుకు ప్రజలంతా ఇక్కడకు తరకి వచ్చారని భట్టి చెప్పారు. కొల్లాపూర్ గడ్డ పోరాటాల గడ్డ,   భూమి కోసం, భుక్తి కోసం, ఆత్మ గౌరవం కోసం ఇక్కడి ఇక్కడి ప్రజలు ఉద్యమాలు చేసారని అన్నారు. నాకు చిన్నతనం నుంచి ఈ ప్రాంతం బాగా పరిచితం. మల్లు ఆనంతరాములు ఎంపీగా పోటీ చేస్తున్న సమయంలో నేను చిన్నతనంలో ఇక్కడి గోడలపై హస్తం గుర్తును ముద్రించిన జ్ఞాపకాలు ఇంకా నా మదిలో ఉన్నాయని విక్రమార్క చెప్పారు.
కొల్లాపూర్ ప్రజలు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం చూపించారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించారని అన్నారు. నీరు పోసి నారు పోసి శాసనసభ్యుడిగా, మంత్రిని చేసి ఒక మనిషిగా నిన్ను కాంగ్రెస్ పార్టీ  తీర్చిదిద్దితే . ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచి టీఆర్ఎస్ లో చేరారని విక్రమార్క అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని భట్టి విక్రమార్క చెప్పారు. అప్పట్లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వృధా అని చెప్పి ప్రాజెక్ట్ ను నిలిపివేసే ప్రయత్నం చేసేంది ఈ కృష్ణారావేనాని విక్రమార్క చెప్పారు.
అభివృద్ధి విషయంలో ఆగ్రహంగా ఉన్న కొల్లాపూర్ ప్రజలు కన్నెర్ర చేస్తే.. అందరూ మాడి పోవాల్సిందేనని అన్నారు.  తెలంగాణ కోసం పోరాట చేసింది.  ఉద్యమాలు చేసింది. ఆత్మ బలిదానాలు చేసింది. నీళ్లు, నిధులు, నియామకాలు,  సామాజిక తెలంగాణ కోసమేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సామాజిక తెలంగాణ ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమని ఆయన అన్నారు.
Tags:A foolish government should be told – to establish a public government

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *