అ ‘పూర్వ’ సమ్మేళనం

– 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న 1991-92 పదోతరగతి విద్యార్థులు
– బసవరాజ జెడ్పీ ఉన్నతపాఠశాల వేదికగా పాతజ్ఞాపకాల నెమరు
– విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఆత్మీయ సన్మానం
– డీజే, ఆటపాటలతో సందడిచేసిన బాల్యస్నేహితులు.

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

’’ అరే రాజేష్‌, రవి, ఈశ్వర్‌, నరేంద్ర… ఎలా ఉన్నారురా.. ఎక్కడున్నారురా? ఎన్నాళ్లయిందిరా మిమ్మల్ని చూసి… గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. చాలా సంతోషంగా ఉందంటూ 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న పాత స్నేహితులందరూ మురిసిపోయారు. వీరందరి కలయికకు బసవరాజ జెడ్పీ ఉన్నతపాఠశాల వేదికగా మారింది. ఆదివారం బసవరాజ జెడ్పీ ఉన్నతపాఠశాలలో 1991-92లో పదోతరగతి చదువుకున్న విద్యార్థులు దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాఠశాలలో సమావేశమయ్యారు. పూర్వవిద్యార్థులు యాదాళంకిషోర్‌, రాధాకృష్ణ, హరికిషోర్‌, నవీన్‌, రమేష్‌, కృష్ణమూర్తి, అజ్మతుల్లా, నారాయణ తదితరులు సమావేశమై మిత్రులందరినీ ఒకచోట చేర్చాలని, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా బసవరాజ పదోతరగతి విద్యార్థులు 1991-92 బ్యాచ్‌ పేరుతో వాట్సప్‌గ్రూప్‌ క్రియేట్‌ చేసి మిత్రులందరికీ సమాచారం అందించారు. ఆదివారం పాఠశాలలో జరిగే పూర్వవిద్యార్థుల ఆత్మీయసమ్మేళనానికి ఆహ్వానం పలికారు. ఇందులోభాగంగా సుమారు 130మందికి పైగా బాల్యస్నేహితులు సుదూరప్రాంతాల నుంచి బసవరాజ హైస్కూల్‌కు చేరుకున్నారు. పాత మిత్రులను కలుసుకుని ఆత్మీయ ఆలింగనాలు, కరచాలనాలతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పాఠశాలలో అప్పట్లో తాముచేసిన అల్లరి,చిలిపిచేష్టలను నెమరువేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పి తమను ప్రయోజకులుగా మలచిన గురువులు పీఈటీ వెంకటరమణ, తెలుగుఉపాధ్యాయులు యరమలనాయుడు, లెక్కలమాష్టారు వెంకటరమణ, సైన్స్టీచర్‌ చంద్రశేఖర్‌ ఆచారి తదితరులను ఘనంగా సన్మానించి పాదాభివందనం చేశారు. స్నేహితులందరూ తమ పరిచయ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న తర్వాత తాము చదివిన పాఠశాల అభివృద్ధికి తమవంతు సేవగా ట్రస్ట్ ఏర్పాటుకు నిర్ణయించారు. పాఠశాల సమావేశమందిరానికి రూఫ్‌టాప్‌ వేయించడంతో పాటు వీధి సూచికబోర్డులు ఏర్పాటుచేస్తూ సేవా కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమయ్యారు. గురువులకు సన్మానకార్యక్రమాలు, విందుభోజనాల తర్వాత డీజే, ఆటపాటలతో తిరిగి చిన్ననాటి మధురస్మతులను గుర్తుకుతెచ్చేలా ఆనందోత్సాహాల్లో మునిగితేలారు. ప్రతి ఏడాది ఇలాగే కలుసుకుందామని, ఒకరి చిరునామాలు మరొకరితో పంచుకుని తీయటి జ్ఞాపకాలతో ఇంటికి పయనమయ్యారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు నరేంద్రరెడ్డి, శరత్‌, కే.వి.సురేష్‌, ఎం.డి.గౌస్‌, రియాజ్‌, ఇర్ఫాన్‌, చాంద్‌బాషా, శివకుమార్‌, రామమూర్తి, జనార్థన, బాల, వెహోహియుద్ధీన్‌, చంద్ర, శ్రీధరభట్టాచార్య, నాగరాజ, సత్యకుమార్‌, శంకర, వంశీ, సతీష్‌, రాజ, మురళీ, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags: A ‘former’ compound

Post Midle
Natyam ad