సరదాగా DNA టెస్ట్ చేయించుకున్న జంటకు షాక్

A fun shock to the couple who performed a DNA test

A fun shock to the couple who performed a DNA test

Date:19/04/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఎవరైనా సరదా కోసం సినిమాకు వెళ్తారు. లేదా లాంగ్ ట్రిప్‌కు వెళ్తారు. కుదరకపోతే రెస్టారెంట్‌కు వెళ్లి కడుపు నిండా తింటారు. కానీ, ఆ జంట మాత్రం సరదాగా DNA టెస్ట్ చేయించుకున్నారు. DNA ఫలితాల్లో తమ పూర్వికుల వివరాలు తెలుసుకున్నారు. అనుకోని ఓ విషయం తెలిసి షాకయ్యారు. చివరికి ఆ సరదా పనే వారిని విడదీసింది. ప్రముఖ పత్రిక ‘మిర్రర్’ కథనం ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి డీఎన్ఏ పరీక్షతో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు. ఇద్దరూ డీఎన్‌ఏ టెస్టులు చేయించుకున్న తర్వాత ancestry.com అనే వెబ్‌సైట్ ద్వారా తమ వంశ వృక్షానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలని భావించారు. ముందుగా ఆమె తన పూర్వికుల వివరాలు తెలుసుకుని చాలా సంతోషించింది. అయితే, బాయ్‌ఫ్రెండ్ వంతు వచ్చేసరికి అనుకోని షాక్‌ ఎదురైంది. అతడి వంశంలోని ఓ వ్యక్తి వల్ల గర్ల్‌ఫ్రెండ్‌ దూరమైంది.  డీఎన్ఏ టెస్టుల్లోని ఫలితాల ప్రకారం.. ఆ యువకుడి పూర్వికుల్లో ఒకరు నరహంతుకుడని తెలిసింది. అతడు చాలామందిని హత్యచేసి జైలు శిక్ష అనుభవించాడని ఉంది. దీంతో ఆమె వేరే ఆలోచన లేకుండా.. ‘‘నీ పూర్వికులు హంతకులు. నీలో కూడా వారి రక్తమే ప్రవహిస్తోంది’’ అంటూ అతడికి గుడ్‌బై చెప్పేసింది. అతడు ఎంతగా నచ్చజెప్పినా వినలేదు. దీంతో అతడు సోషల్ మీడియాలో తన కష్టాలను చెప్పుకున్నాడు. అతడి దీనగాధ విన్న నెటిజన్స్.. ఆమె ముందుగానే నిన్ను వదిలించుకోవాలని ప్లాన్ చేసినట్లుంది. అందుకే అలా చేసిందని కామెంట్స్ చేశారు. అలాంటి గర్ల్‌ఫ్రెండ్ నీకు అవసరమా.. పోతేపోనీ, కొత్తగా ఎవరికైనా ట్రైచెయ్యి. కానీ, డీఎన్‌ఏ టెస్టులు వంటి పిచ్చివేషాలు వేయకుండా పనికొచ్చే పనులు చేయంటూ క్లాస్ పీకారు.
Tags:A fun shock to the couple who performed a DNA test

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *