Natyam ad

పుంగనూరులో ఇరవైనాలుగేళ్ల నీరీక్షణతో బాలిక జననం

– మహిళా దినోత్సవ కానుక

 

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునేందుకు సిద్దమౌతున్న తరుణంలో ఇరవైనాలుగేళ్ల నీరీక్షణ తరువాత ఓతల్లి బాలికకు జన్మనిచ్చింది. ఈ సంఘటనతో ఆకుటుంబంలో సంతోషానికి అవదులులేకుండ పోయింది. పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీలో నివాసం ఉన్న మస్తాన్‌ , హలీమా దంపతులకు 1999 లో వివాహం జరిగింది. 24 సంవత్సరాలైన పిల్లలు కలగలేదు. అనేక కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్సలు చేసుకున్నా ఫలితం లేకపోయింది. స్నేహితుల సూచనల మేరకు ఈ దంపతులు పట్టణంలోని తేజ ఆసుపత్రి చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ డాక్టర్లు చైతన్యతేజారెడ్డి , గైనకాలజిస్ట్ డాక్టర్‌ లక్ష్మీసంగీతారెడ్డిని గత ఏడాది కలిసి చికిత్సలు చేసుకోవడం ప్రారంభించారు. ఎలాంటి కృత్రిమ పద్దతులు లేకుండ కేవలం తల్లి హార్మోన్లను క్రమబద్దీకరించి వైద్యసేవలు అందించడంతో ఆమె తొలిసారిగా 24 ఏళ్ళ తరువాత గర్భందాల్చిందని డాక్టర్‌ తెలిపారు. ఆమెకు ప్రతి పదిహేను రోజులకొక్కసారి పరీక్షలు నిర్వహించి బిడ్డ ఎదుగుదలకు చికిత్సలు అందించామన్నారు. సర్జరీ ద్వారా ప్రసవం జరిగిందని డాక్టర్‌ తెలిపారు. పిల్లలు పుట్టలేదని ఎవరు దిగులుపడరాదని , వైద్యుల సూచనలను పాటిస్తే మంచి ఫలితాలు ఉంటుందన్నారు.తల్లి,బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్‌ తెలిపారు.

Tags: A girl was born in Punganur after twenty-four years of water waiting

Post Midle