ప్రియుడితో కలిసి మరో ప్రియుడిని చంపిన ప్రియురాలు

A girlfriend who killed another boyfriend with her boyfriend

A girlfriend who killed another boyfriend with her boyfriend

– నిందితులు అరెస్ట్
– రిమాండుకు తరలింపు
– డిఎస్పీ అరీపుల్లా

Date:15/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

ప్రియుడి వేదింపులు తాళలేక మరోక ప్రియుడితో కలసి ప్రియుడిని చంపి శవాన్ని తగులబెట్టిన సంఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసిన సంఘటన పుంగనూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించి పలమనేరు డిఎస్పీ అరీపుల్లా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఎంఎస్‌ఆర్‌ •యెటర్‌ వద్ద నివాసం ఉన్న ఖాదర్‌బాషా భార్య మల్లికాభాను నివాసం ఉన్నారు. ఇలా ఉండగా ఖాదర్‌బాషాను బార్య మల్లికాబాను వదిలివేసి ,మరోక ప్రియుడై షబ్బిర్‌తో నివసిస్తోంది. అతడు చెడు అలవాట్లకు బానిసై నిత్యం భార్యను వ్యబిచారం చేసి జల్సాల కోసం డబ్బులు సంపాదించమని ఒత్తిడి చేయడంతో మల్లికాబాను తన మరో ప్రియుడు షేక్‌ చాంద్‌బాషాతో కలసి గత నెల 21న షబ్బిర్‌ను హత్య చేశారు. షబ్బిర్‌ తాగిన మైకంలో ఇంట్లో నిద్రిస్తుండగా మల్లికాబాను , చాంద్‌బాషా కలసి లుంగితో మెడబిగించి హత్యచేశారు. తరువాత చాంద్‌బాషా బలోరోజీపులో మండలంలోని కృష్ణాపురం అటవీప్రాంతానికి తీసుకెళ్లి కొబ్బరిపీచును వేసి మృతుడి శ రీరంపై పెట్రోలుపోసి కాల్చి పరారైయ్యారని డిఎస్పీ తెలిపారు. మృతుడి శవాన్ని గత నెల 29న పోలీసులకు సమాచారం రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా మల్లికాబాను ఆమె ప్రియుడు చాంద్‌బాషా కలసి హత్యచేశారని రుజువైందన్నారు. నిందితులు ఇరువురిని పట్టణ సమీపంలోని భగత్‌సింగ్‌కాలనీ వద్ద సీఐ మదుసూదనరెడ్డి , ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డిలు కలసి అరెస్ట్ చేశార న్నారు. వీరిరువురిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించామన్నారు.

గణపయ్యకు వీడ్కోలు

Tags: A girlfriend who killed another boyfriend with her boyfriend

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *