వైభవంగా భజనమండళ్ల శోభాయాత్ర

తిరుప‌తి ముచ్చట్లు:

టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాల్లో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యం నుంచి మూడో సత్రం వ‌ర‌కు భజనమండళ్లతో శోభాయాత్ర వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి 3 వేల మంది భజనమండళ్ల సభ్యులు శోభాయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. ఆగ‌స్టు 27వ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాలమండపం వద్ద ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తామన్నారు. అక్కడినుంచి భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేస్తూ తిరుమలకు చేరుకుంటారని తెలిపారు.

 

 

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య డెప్యూటి ఈవో   శాంతి, ఇత‌ర అధికారులు, భ‌జ‌న మండ‌ళ్ల స‌భ్యులు శోభాయాత్ర‌లో పాల్గొన్నారు.ఇదిలా ఉండ‌గా, మూడో సత్రం ప్రాంగణంలో ఉదయం 5 నుండి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు భజన మండలి సభ్యులకు కొత్త సంకీర్తనలు నేర్పడం, ధార్మిక సందేశం, మానవాళికి హరిదాసుల ఉపదేశాలు అందించారు.

Tags: A glorious procession of bhajanmandala

Leave A Reply

Your email address will not be published.