కార్పొరేట్ పాఠశాలలను తలదన్నిన ప్రభుత్వ పాఠశాల
పుంగనూరు ముచ్చట్లు:
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గూడూరుపల్లి 2022 23 విద్యా సంవత్సరం 10వ.తరగతి ఫలితాలయందు పుంగనూరు రూరల్ పాఠశాలలన్నింటికంటే అత్యధిక మార్కులు గగన్ కుమార్ 573 ,రూపేష్ రెడ్డి 569, బాలాజీ 562 ,హరియతీశ్వర్ 554 ,తేజస్వి 548, భావన 508 మార్కులు సాధించి కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే విధంగా ఉత్తమ ఫలితాలను సాధించడం కార్పొరేట్ పాఠశాలకు దీటుగా పాఠశాల విద్యార్థుల ఫోటోలతో కూడిన బ్యానర్లు ప్రదర్శించడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నదని ప్రథమ శ్రేణిలో 32 ద్వితీయశ్రేణిలో 12, తృతీయ శ్రేణిలో 5 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేష్ నారాయణ తెలియజేశారు. పాఠశాల తల్లిదండ్రుల విద్యాకమిటీ చైర్మన్ రమణప్ప మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ .జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యకు ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నారని నాడు నేడు కార్యక్రమం కింద భవన నిర్మాణాలు,జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక ( J V K) లో భాగంగా పాఠ్య పుస్తకాలు, నాణ్యమైన నోట్ బుక్స్ , బూట్లు, సాక్స్ లు ,రాగి జావా ,చిక్కీలు, కోడిగుడ్లు పౌష్టికాహారం అందజేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించుటకు ముఖ్య భూమిక వహించారని ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ని ,రాష్ట్ర విద్యుత్ గనులు శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని, ఎంపీ మిథున్ రెడ్డి ని ప్రశంసిస్తూ విద్యార్థులను అభినందించడమైనది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జీ .వి. రమణ , రాజేష్ నర్సింహులు రఘు సురేష్ రెడ్డి అమర్నాథ్ గ్రామస్తులు పాల్గొన్నారు.
Tags:A government school that beats corporate schools

