నోటి దురుసుతో ఓ ప్రభుత్వ టీచర్ సస్పెండ్

A government teacher is suspended with a mouthpiece

A government teacher is suspended with a mouthpiece

Date:11/01/2019
భోపాల్ ముచ్చట్లు:
నోటి దురుసుతో ఓ ప్రభుత్వ టీచర్ చిక్కుల్లో పడ్డాడు. ఏకంగా ముఖ్యమంత్రిపైనే విమర్శలు చేసి సస్పెండ్ అయ్యాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ సమీపంలో ముఖేష్ తివారీ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఓ సమావేశంలో పాల్గొని మాట్లాడాడు. గత 14 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉంది.. అయినా చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది.. వీళ్లేం చేస్తారో చూద్దామన్నారు. తివారీ అక్కడితో విమర్శలను ఆపలేదు. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. ప్రస్తుత ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఇద్దరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించారు. తివారీ మాట్లాడిన ప్రసంగాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. అది వైరల్‌గా మారింది. కాంగ్రెస్ నేతలు ఈ వీడియోను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇలా ముఖ్యమంత్రిపై నోరు పారేసుకుంటాడా అంటూ విమర్శలొచ్చాయి. విమర్శలు రావడంతో ముఖేష్ తివారీపై చర్యలు తీసుకున్నారు. ఆయన్ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. అత్సుత్సాహానికి పోయిన ఉపాధ్యాయుడు ఏదో అనుకుంటే.. పాపం ఇంకేదో జరిగింది.
Tags:A government teacher is suspended with a mouthpiece

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *