నిరుపయోగంగా కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ భవనాలు

నిరుపయోగంగా కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ
భవనాలు

సంవత్సరాల తరబడి పట్టించు కోకపోవడంతో శిధిలావస్థకు చేరుకుంటున్న భవనాల

బద్వేలు ముచ్చట్లు:

బద్వేల్ పట్టణం జాతీయ రహదారి పక్కన కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భవనాలు ఉన్నాయి వీటిలో ఒకటి ఆర్ అండ్ బి శాఖకు చెందినది ఇంకొకటి నీటిపారుదల శాఖకు చెందినది ఈ రెండు భవనాలు ఒకప్పుడు ఒక్క వెలుగు వెలిగాయి అధికారులు సిబ్బంది ప్రజలతో రెండు  కార్యాలయాలు కళకళ లాడుతుండేవి ఇది గతం దాదాపు 15 సంవత్సరాలుగా ఈ భవనాల గురించి
సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి ఆర్ అండ్ బి శాఖకు చెందిన భవనంలో ఒకప్పుడు ఆ శాఖ డి ఈ కార్యాలయం ఉండేది డి ఈ తో పాటు ఏఈలు సిబ్బంది ఈ కార్యాలయం భవనం నుండే విధులు నిర్వహించేవారు ఇప్పుడు ఈ భవనం రూపురేఖలే మారిపోయాయి ఆర్ అండ్ బి డి ఈ కార్యాలయానికి ఆ శాఖ అతిథి గృహం ఆవరణలోనే కొత్తగా కార్యాలయం నిర్మించడంతో పాత కార్యాలయాన్ని అధికారులు పూర్తిగా మర్చిపోయారు ఇప్పుడు ఈ భవనం ఆర్ అండ్ బి శాఖకు చెందినది అనే విషయాన్ని ప్రజలు కూడా మర్చిపోయారు జాతీయ రహదారి పక్కనే భవనం ఉండడంతో కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుంది కార్యాలయం లోపల దారుణంగా తయారైంది ఆవరణ మొత్తం మురికి కూపముగా మారింది ఇలాంటి దుస్థితిలో భవనం ఉంది దీని పక్కనే నీటిపారుదల శాఖ ఏ ఈ కార్యాలయం భవనం ఉంది ఈ భవనాన్ని కూడా ఘనమైన చరిత్ర ఉంది నీటిపారుల శాఖ ఏఈతోపాటు సిబ్బంది విధులు నిర్వహించేవారు గతంలో ఈ భవనం ఆ శాఖ డి ఈ కార్యాలయంగా ఉండేది కార్యాలయం ఆవరణలోనే డి ఈ కార్యాలయానికి మరో భవనం నిర్మించడంతో కొన్ని సంవత్సరాల క్రితం అక్కడికి డి ఈ కార్యాలయం వెళ్ళింది ఆ తర్వాత డి ఈ కార్యాలయం పక్కనే ఏ ఈ కార్యాలయం భవనం నిర్మించారు అక్కడికి ఏ ఈ కార్యాలయం తరలిపోయింది ఆ తర్వాత పాత భవనాన్ని అధికారులు పూర్తిగా మర్చిపోయారు ఈ భవనం ఇప్పుడు దాదాపు శిథిలావస్థకు చేరుకుంది జాతీయ రహదారి పక్కనే ఈ రెండు ప్రభుత్వ భవనాలు ఉండడంతో ఇప్పుడు ఉన్న ధరల్లో కొన్ని కోట్ల రూపాయలు పలుకుతుంది

Tags: A government that values crores of rupees useless
Buildings

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *