పుంగనూరులో ఘనంగా క్రీస్తు పునరుద్దాన పండుగ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని సీఎస్‌ఐ అట్టన్ మెమెరియల్ చర్చిలో క్రీస్తు పునరుద్దాన పండుగను క్రైస్తవులు ఆదివారం వేకువజాము నుంచి నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాస్టర్ రాకేష్‌నిమ్రోద్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు శిలువై మృతి చెంది మూడవ దినం సజీవుడై తిరిగిలేచారని తెలిపారు. ఏసుక్రీస్తు ఎన్నోశ్రమలకు ఓర్చి , పాపులను సైతం సన్మార్గంలో నడిపించారని తెలిపారు. ఈ సందర్భంగా ఏసుప్రభువు పాటలను ఆలాపించారు. ప్రత్యేకప్రార్థనలు నిర్వహించి, పేదలకు అన్నదాన కార్యక్రమాలునిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రైస్తవులు పాల్గొన్నారు.

Tags; A grand celebration of Resurrection of Christ in Punganur
