Natyam ad

పుంగనూరులో వైభవంగా రథోత్సవం

పుంగనూరు ముచ్చట్లు:

మండలంలోని నెక్కుంది కొండలపై వెలసియున్న శ్రీఅగస్తీశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి రథాన్ని పూలతో సుందరంగా అలంకరించారు. ఆలయ కమిటి చైర్మన్‌ రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారి ఆలయంలో హోమాలు, పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై రథోత్సవంపై మిరియాలు, ఉప్పు, పూలు చల్లి  మొక్కులు చెల్లించుకున్నారు. కొండపై రథాన్ని లాగుతూ ఓం నమశివాయ అంటు నినాదాలు చేయడంతో ఆప్రాంత భక్తిపారవశ్యమైంది. ఆలయంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పలువురు అన్నదానం చేశారు. సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Post Midle

Tags: A grand Rathotsavam in Punganur

Post Midle