Natyam ad

భారతదేశానికి ఘనంగా వందనం చేసిన అల్ఫోర్స్. 

కరీంనగర్ ముచ్చట్లు:

భారతదేశం అతి ప్రాచీనమైనదని  స్వాతంత్య్రం సాధించిన విధానం  చారిత్రాత్మకమైనదని విశిష్టమైనదని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥వి. నరేందర్ రెడ్డి  స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ -టెక్నో స్కూల్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించినటువంటి భారత్ హరితహారం  దేశభక్తి గేయాల పోటీల కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా హాజరై  మాట్లాడారు . ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి దేశనాయకుల చిత్రపటాలకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందని  ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమని చెప్పారు . భారతదేశంలో ప్రతి ఒక్కరు దేశ రక్షణకై పాటుపడుతారని  అభివృద్ధికి బాటలు వేయడంలో ఆదర్శప్రాయులని వారు చెప్పారు . గత 75 సం॥లుగా భారత దేశం అంచేలంచలుగా వివిధ రంగాలల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తు ఇతర దేశాలకు ధీటుగా నిలుస్తున్నదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పారు . ప్రత్యేకంగా కరోనా విపత్తు సమయంలో భారతదేశం వ్యవహరించిన తీరు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందినదని ఆదర్శప్రాయంగా సేవలను పొరుగుదేశాలకు అందించి ఆపన్న హస్తంతో పాటు పెద్దన్న పాత్ర పోషించినదని వారు తెలియజేశారు . ఇంతటి మహోనతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి వర్యులు గౌ ॥ శ్రీ నరేంద్ర మోడీ  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  లకు  పాఠశాలల తరపున ధన్యవాదాలు తెలియజేశారు  నిరంతర కృషి చేస్తు దేశాన్ని కనురెప్పలా కాపాడుతున్న సైనికులకు వందనం చేశారు .

 

 

 

సాంకేతిక రంగంలో విజయపధాన పయనిస్తు యావత్ ప్రపంచానికే తలమానికంగా నిలిచి కరోన వ్యాక్సిన్ను కనుగొని కరోన తీవ్రతను తగ్గుముకం పట్టే విధంగా చేసిన కృషి చాలా స్లాగనీయమైనది . ప్రతి ఒక్కరు భారత దేశ ఔనత్వాన్ని సంరక్షించే విధంగా అకుంటిత దీక్షతో పాటుపడి దేశ గొప్పతనాన్ని రెట్టింపు చేసే విధంగా ఉండాలని సూచించారు . నేడు మన సైనికులు అహో రాత్రులు కష్టపడుతూ కుటుంబాన్ని సైతం లెక్కచేయకుండా దేశం కోసం త్యాగం చేస్తున్న తీరు చాలా ఉత్తమమైనదని  ప్రతి ఒక్కరు వారి కుటుంబాలకు భాసటగా నిలవడమే కాకుండా వారికి కావలసిన అవసరాలను సమకూర్చడంలో ప్రధాన పాత్ర పోషించి జవాన్లకు వంధనాలు సమర్పించాలని సూచించారు . యావత్ భారత దేశం గర్వపడేలా ఉత్సాహం ఉట్టిపడేలా కొనసాగుతున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నేడు పాఠశాలలో విద్యార్థులకు దేశ భక్తి గేయ పోటీలను పర్యావరణ హితమైన హరితహారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినదని వారు చెప్పారు . దేశ భక్తిని నింపే విధంగా ఆలపించిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు  భవిష్యత్లో మరిన్ని కార్యక్రమంలో పాల్గొని మన్నలను పొందాలని ఆకాంక్షించారు . కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు భారత్మతాకి జై , మహత్మాగాంధీకి జై , జై జవాన్ జై కిసాన్ నినాదాలు చేసి ఉత్సాహాన్ని నింపి భారతదేశానికి జై కొట్టారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయ బృందం  విద్యార్థులు పాల్గొన్నారు .

 

Post Midle

Tags: A grand salute to India.

Post Midle

Leave A Reply

Your email address will not be published.