రాజమౌళికి గ్రాండ్ వెల్ కమ్
హైదరాబాద్, ముచ్చట్ల:
ఆస్కార్ అవార్డు సాధించిన అనంతరం ‘ఆర్‌ఆర్‌ఆర్’ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. మార్చి 17వ తేదీ తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న డైరెక్టర్ రాజమౌళి, ఆయన సతీమణి రమ, సంగీత దర్శకుడు కీరవాణి ఆయన సతీమణి వల్లి, కార్తికేయ, కాలభైరవ, శ్రీసింహాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.రాజమౌళి, కీరవాణితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం రద్దీగా మారింది. కట్టు దిట్టమైన భద్రత నడుమ కీరవాణి, రాజమౌళి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. RRR సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడం సంతోషంగా ఉందని రాజమౌళి, కీరవాణి తెలిపారు. మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌తో మాట్లాడేందుకు కొందరు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా.. ‘జైహింద్’ అంటూ రాజమౌళి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కరోన సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ పూర్తిగా సైలెంట్ అయిపొయింది.

థియేటర్స్ లో సినిమాలు లేవు, రెవిన్యూ లేదు. కరోన ప్రభావం తగ్గినా వెంటనే థియేటర్స్ ని ఓపెన్ చెయ్యలేదు. ఇలాంటి ఎప్పుడు థియేటర్ ఓపెన్ అయినా, మేము ఎప్పుడు థియేటర్స్ లోకి వచ్చినా ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేస్తాం అని మాట ఇచ్చాడు జక్కన్న అలియాస్ ఎస్ ఎస్ రాజమౌళి. చరణ్, ఎన్టీఆర్ లని పెట్టి ఆర్ ఆర్ ఆర్ సినిమా రూపొందించిన జక్కన్న ఇండియన్ సినిమా అంటే ఏంటో వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి తెలిసేలా చేశాడు. ఇండియాలో 1200 కోట్లు రాబట్టిన ఈ మూవీ జపాన్ లో 200 రోజులుగా సాలిడ్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో ఆడుతూనే ఉంది. ఒక ఇండియన్ సినిమా చేరుకోలేని ప్రతి చోటుకి ఆర్ ఆర్ ఆర్ సినిమాని చేర్చిన రాజమౌళి, ఎట్టకేలకు ఎవరూ ఊహించనిది నిజం చేశాడు, మన నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ వచ్చింది.ఇండియన్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఒక సినిమాకి అందులోనూ ఫక్తు తెలుగు పాటకి ఆస్కార్ అవార్డ్ లభించడం అంటే అది కొత్త చరిత్రకి పునాది అనే చెప్పాలి. వెస్ట్రన్ ఆడియన్స్ తో పాటు స్టీఫెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కమరూన్ లాంటి వరల్డ్స్ బెస్ట్ డైరెక్టర్స్ ని కూడా ఇంప్రెస్ చేసిన రాజమౌళి హైదరాబాద్ కి తిరిగొచ్చాడు. ప్రపంచాన్ని గెలిచిన అలెక్జాండర్ లా వెస్ట్రన్ సినిమా ప్రపంచాన్ని గెలిచొచ్చిన రాజమౌళి అండ్ టీంకి అభిమానులు ఘన స్వాగతం పలికారు.
Tags;A grand welcome to Rajamouli
