– రెండవ సారి ఆమెకు అవార్డు
పుంగనూరు ముచ్చట్లు:
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వారికి చిత్తూరు జెడ్పి మీటింగ్ హాల్‌లో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, జెడ్పి చైర్మన్ శ్రీనివాసులు, డీఈవో దేవరాజులు ఆధ్వర్యంలో గురువారం సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని అడవినాథునికుంట మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ టిఎన్.రమను సన్మానించారు. కాగా డాక్టర్ రమ రెండేళ్ల క్రితం అవార్డును తీసుకున్నారు. రెండవ సారి ఆమె అవార్డులు తీసుకుని రికార్డు సృష్టించారు. డాక్టర్ రమ 2013లో జువాలజి అధ్యాపకురాలుగా బైరెడ్డిపల్లి మోడల్‌స్కూల్‌లో చేరారు. 2019లో శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటి నుంచి డాక్టరేట్ పొందారు. 2020లో ప్రిన్సిపాల్ రిక్రూట్‌మెంట్ కమిటి డాక్టర్ రమను అడవినాథునికుంట మోడల్‌స్కూల్ ప్రిన్సిపాల్‌గా నియమించారు. వీరి తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులుగా పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవార్డు రావడంతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. తనకు అవార్డు రావడానికి సహకరించిన అధ్యాపకులకు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో 10వ తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించి రికార్డు సృష్టించామని , ఈ అవార్డు తమ సహచర అధ్యాపకులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు.
Tags: A great honor to Dr. Rama, principal of Adivinathunikunta