రైలు కిందపడి చేనేత కార్మికుడు మృతి
మదనపల్లి ముచ్చట్లు:
మదనపల్లి మండలంలోని సిటిఎం రైల్వే స్టేషన్ కు కొత్తపేట దూరంలో సోమవారం మధ్యాహ్నం రైలు కిందపడి చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. కదిరికి చెందిన ఓ యువకుడు మదనపల్లి లోని నీరుఘటి వారి పల్లెలో గత కొంతకాలంగా చేతి మగ్గాలు నేస్తూ కాలం వెలదీస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందో ఏమో.. మదనపల్లి మండలంలోని సిపిఎం గ్రామం రైల్వే స్టేషన్ కు పడమర బాగాన ఉన్న ఓ ప్రముఖ ఫార్మసి కళాశాలకు సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై రైలు కిందపడి బలవన్ మరణం చెందినట్లు ఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది.

Tags: A handloom worker died after being hit by a train
