భారీ డ్ర‌గ్ రాకెట్‌ గుట్టు ర‌ట్టు

న్యూఢిల్లీ  ముచ్చట్లు :

భారీ డ్ర‌గ్ రాకెట్‌ను ఎన్సీబీ పోలీసులు గుట్టు ర‌ట్టు చేశారు. గ‌త రెండు ద‌శాబ్ధాల కాలంలో ఇదే అతిపెద్ద రాకెట్‌గా భావిస్తున్నారు. డార్క్ నెట్‌, క్రిప్టోల ద్వారా జ‌రుగుతున్న ఎల్ఎస్‌డీ డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాను పోలీసులు చేధించారు. ఈ కేసులో ఇప్ప‌టికే ఆరుగుర్ని అరెస్టు చేశారు. దాదాపు 15 వేల డ్ర‌గ్స్ ప్యాకేజీల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎల్ఎస్‌డీని లైసెర్జిక్ యాసిడ్ డైథిల‌మైడ్ అంటారు. ఇదో సింథ‌టిక్ డ్ర‌గ్. ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంది. ఇంత భారీ స్థాయిలో ఎల్ఎస్‌డీని స్వాధీనం చేసుకోవ‌డం గ‌త రెండు ద‌శాబ్ధాల్లో ఇదే మొద‌టిసారి అని ఎన్సీబీ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వ‌ర్ సింగ్ తెలిపారు.

Post Midle

Tags:A huge drug racket was busted

 

Post Midle