పుంగనూరులో ఇంటింటా జగనన్నే మా భవిష్యత్తు
పుంగనూరు ముచ్చట్లు:
జగనన్నే మా భవిష్యత్తు… జగనన్నే మాప్రాణం అంటు ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించడంతో ప్రజలు ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. బుధవారం మున్సిపాలిటిలో చైర్మన్ అలీమ్‌బాషా, రాయలసీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, వక్ఫ్బోర్డు చైర్మన్ అమ్ము ఆధ్వర్యంలో 31 వార్డులలో కౌన్సిలర్లు, పార్టీ ప్రతినిధులు, గృహసారధులు ఇంటింటికి వెళ్లారు. కరపత్రాలు పంపిణీ చేసి, నాలుగు ప్రశ్నలకు సమాదానాలు సేకరించారు. ప్రజల అనుమతితో స్టిక్కర్లు వేశారు. అలాగే మండలంలోని మంగళం, కంగానెల్లూరు, గుడిసెబండ, బండ్లపల్లె ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అమరనాథరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డితో కలసి జగనన్నే మా భవిష్యత్తు….మానమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్లి నిర్వహించారు. సెల్‌ఫోన్లకు స్టిక్కర్లు వేసి , ముఖ్యమంత్రి సెల్‌నెంబరుకు మిస్‌డ్‌కాల్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు కొత్తపల్లె చెంగారెడ్డి, వరదారెడ్డి, కౌన్సిలర్లు, గృహసారధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags: A huge rally by RSS in Punganur on 14th
