-కలకత్తా వైద్య విద్యార్థి హత్యాచారం ఘటనపై ఎం.వి.ఆర్ కళాశాల 700 మంది విద్యార్థినీ విద్యార్థులతో ఆధ్యాపకుల బృందం భారీ ర్యాలీ… వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు
-చట్టాలు కట్టిన తరం చేస్తే ఇలాంటివి పునరా వృతం కావు
-1947 చట్టాలతో లాభం లేదు అంటున్న ప్రిన్సిపల్
చిత్తూరు ముచ్చట్లు:
పలమనేరు నియోజకవర్గ గంగవరం మండలం ఎంవిఆర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు సుమారు 700 మంది కోల్కతా వైద్య విద్యార్థి హత్యాచారం ఘటనపై,సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో కళాశాల వద్ద నుండి పలమనేరు అంబేద్కర్ సర్కిల్ వరకు ఫ్లకార్డ్స్ చేతబట్టి వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎం. వి.ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మీ సుధా వైస్ ప్రిన్సిపాల్ శ్వేత మాట్లాడుతూ, కోల్కతా ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది నేరస్థుడు ఎంతటి పెద్దవాడైనా సరే వెంటనే శిక్ష వేయాలన్నారు, 1947 చట్టాలతో లాభం లేదు ఇకనైనా ప్రభుత్వాలు గట్టి చట్టాలు తెచ్చి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ఆడపిల్లల పైన అత్యాచారాలు ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా ఆడపిల్లల పైన దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వాలు ఎందుకు గట్టి చర్యలు తీసుకోవడం లేదు.కచ్చితంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందన్నారు.విద్యార్థులు మాట్లాడుతూకలకత్తా వైద్య విద్యార్థి హత్యాచారం ఘటన యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది. ఆడపిల్లకు భద్రత లేకుండా పోతోంది ఇల్లు బడి వైద్యశాల తేడా లేకుండా ఎంతోమంది ఎన్నో రకాలుగా నరకం అనుభవిస్తున్నారు. ముఖ్యంగా మగవారు ఆడపిల్లల పైన చూసే చూపులో మార్పు రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుడు ఆలోచన పెట్టుకోకూడదు. ఆడపిల్ల పైన ఇలాంటి ఆకృత్యాలు జరిగితే వెంటనే శిక్షలు అమలు చేయాలి అలాంటప్పుడే ఇలాంటివి ఆగుతాయన్నారు.
Tags:A huge rally of 700 students and faculty members