అమరావతి ముచ్చట్లు:
ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆళ్లరామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాజకీయ కక్ష్య సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం మందలించింది. ఆ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.
Tags: A huge relief for AP Chief Minister Chandrababu in the case of notes for votes