Natyam ad

పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా సమీపంలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది

అమరావతి ముచ్చట్లు:
 
దీని ప్రభావంతో భారీగా ప్రకంపనలు మొదలయ్యాయి. సముద్ర జలాలు ముందుకు దూసుకొచ్చాయి.
సునామీ సంభవించే ప్రమాదం ఉందని ముందుగానే పలు దేశాలు ప్రమాద హెచ్చరికలు జారీ చేశాయి. అగ్నిపర్వతం బద్దలవడంతో తీరప్రాంతాల్లో పెద్దఎత్తున బూడిద ఆవరించింది. ఆకాశంలో 20 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు అలుముకున్నాయి.టోంగా జియోలాజికల్ సర్వీసెస్ సంస్థ వివరాల ప్రకారం.. పసిఫిక్‌లో మహాసముద్ర అంతర్భాగంలో పలు అగ్నిపర్వతాలు ఉన్నాయి. టోంగా వద్ద అగ్నిపర్వతం హుంగా టోంగా-హుంగా హాపై ఒక్కసారిగా బద్దలైంది. ఈ అగ్నిపర్వతం.. టోంగాన్‌ రాజధాని నుకువాలోఫాకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. అగ్నిపర్వతం పేలిన శబ్దాలు 8 నిమిషాల పాటు వినిపించాయి. దాని విస్ఫోటనం తీవ్రత 800 కిలోమీటర్ల దూరంలో ఫిజీ దీవులకు వ్యాపించింది. సముద్రంలో పేలిన అగ్నిపర్వతం దృశ్యాలను శాటిలైట్లలో రికార్డయ్యాయి. హిమావరీ శాటిలైట్‌లో రికార్డైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ పేలుడు న్యూజిలాండ్, టోంగా, ఫిజీ దేశాలు ముందుస్తు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. దాంతో సముద్ర తీర ప్రాంతాల్లోనివారంతా నివాసాలను వదిలి ఎత్తైన ప్రదేశాలకు చేరుకుంటున్నారు. ముందుగా సునామీ హెచ్చరికలు జారీ చేసి వెనక్కి తీసుకున్న కొన్ని గంటల్లోనే మళ్లీ సునామీ హెచ్చరికలను జారీ చేశాయి. నుకువాలోఫా వద్ద 1.2 మీటర్ల సునామీ అలలను గుర్తించినట్టు ఆస్ట్రేలియా వాతావరణ శాస్త్ర బ్యూరో ట్వీట్ చేసింది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: A huge volcano erupts near Tonga in the Pacific Ocean