స్నేహితుడి ప్రియురాలినే కాటేసిన మానవ మృగాలు.

సూళ్లూరుపేటలో దారుణ ఘటన, ..

స్నేహితుడి కట్టేసి అతని కళ్ళముందే యువతిని బలాత్కరించిన కిరాతక ఘటన.

 

సూళ్లూరుపేట ముచ్చట్లు:

 

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం పరిధిలోని దామరాయ గ్రామ పరిసరాలు మంగళవారం రాత్రి ప్రేమికుడిని కట్టేసి ప్రియురాలి పై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు, నిందితులు వారికి తెలిసిన వ్యక్తే కావడం గమనార్హం, నెల్లూరు జిల్లాకు చెందిన యువతీ,యువకుడు ఒక ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ సహజీవనం సాగిస్తున్నారు,యువకుడికి  బాలాజీ,ఏడు మలై అనే స్నేహితులు ఉన్నారు,మంగళవారం ఉదయం ఆ యువకుడు అతని స్నేహితులు బాలాజీ ఎదుమలై సూళ్లూరుపేటలో మద్యం తాగారు,

 

 

మళ్లీ రాత్రి 7:30 ఆ యువకుడికి ఫోన్ చేసి మీ ప్రియురాలు జన్మదినం సందర్భంగా ఆమెను తీసుకుని కొరిడి శివాలయం వద్దకు వెళ్దామని నమ్మబలికించారు, కంపెనీలో పనికి వెళ్ళున్న ప్రియురాలు కోసం ఆ యువకుడు సూళ్లూరుపేటలోని వై జంక్షన్ వద్ద ఉండగా మొదట అతని స్నేహితులు ఏడుమలై,బాలాజీ అక్కడికి రాగా కొంచెం సేపటికి ఆ యువతి కూడా అక్కడికి చేరుకుంది, అందరూ కలిసి పులికాట్  తీరంలోని దామరాయ ప్రాంతానికి వెళ్ళగానే ఏడుమలై బాలాజీ కలిసి అతని స్నేహితుడిని బలవంతంగా పట్టుకుని చొక్కా విప్పి ఆ చొక్కా తోనే అతని చేతులు కట్టేసారు, బాలాజీ కాపలా ఉండగా ఏడు మలై ఆ యువతినీ బెదిరించి అత్యాచారం చేసి యువతి వద్ద నుండి నగదు,సెల్ఫోన్ లాక్కుని పారిపోయాడు, బాధితులు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీహరికోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags; A human beast that bit a friend’s girlfriend.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *